హీరోయిన్ హన్సిక మోత్వానీ గురించి తెలియని సినీ ప్రేమికులు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన హన్సిక.. పూరి జగన్నాధ్ దర్శత్వం వహించిన ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. 16 ఏళ్ళ వయసులోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న హన్సిక తెలుగులో ప్రభాస్ – ఎన్టీఆర్ – రవితేజ – రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ‘బిల్లా’ ‘మస్కా’ ‘పవర్’ ‘కందిరీగ’ ‘ఓ మై ఫ్రెండ్’ ‘దేనికైనా రెడీ’ వంటి సినిమాలు హన్సికని టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మార్చాయని చెప్పవచ్చు.
ఇక బొద్దుగా మారిపోయి కోలీవుడ్ లో కొన్నేళ్లుగా సత్తా చాటుతోంది. అక్కడ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసిన ఈ ఆపిల్ బ్యూటీకి తమిళనాట అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేసారు. ఈ క్రమంలో తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదు. హన్సిక తెలుగులో చివరగా సందీప్ కిషన్ కు జోడిగా ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్’ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అమ్మడికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా హన్సిక మళ్ళీ మంచి షేప్ కోసం ట్రై చేస్తోంది. ఒకప్పుడు తన బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన హన్సిక ఇప్పుడు నాజూకుగా మారిపోయింది. కొత్త అందాలతో ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అయితే ఇదంతా తన మాతృభాష హిందీలో పాగా వేయడానికే అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ‘ఆప్ కా సరూర్’ ‘మనీ హై తో హనీ హై’ వంటి చిత్రాలలో నటించిన హన్సిక మోత్వానీ ఇప్పుడు మళ్ళీ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తోందని సమాచారం. ఏజ్ కూడా పెద్దగా ఎక్కువ లేకపోవడంతో ఈసారి ఎలాగైనా అవకాశాలు చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్లాన్ చేస్తోందట. మరి ఈ ఆపిల్ బ్యూటీ బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకొని అక్కడ కూడా హవా కొనసాగిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం హన్సిక తమిళ్ లో ‘మహా’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.