గడిచిన రెండేళ్లు అందరికీ ఓ పెద్ద సవాల్‌

గడిచిన రెండేళ్లు అందరికీ ఓ పెద్ద సవాల్‌

ఒకటి కాదు.. రెండు కాదు… ప్లాన్‌ చేసిన ప్రకారం జరిగితే హన్సిక ఈ ఏడాది నైన్‌ ప్రాజెక్ట్స్‌లో కనిపిస్తారు. ఇది ఆమె అభిమానులు ఆనందపడే న్యూస్‌. ‘పార్ట్‌నర్‌’, ‘రౌడీ బేబీ’, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘105 మినిట్స్‌’, ‘మహా’, ఒక ఓటీటీ ప్రాజెక్ట్, ఇంకా పేరు ఖరారు కాని మూడు చిత్రాలు.. ఇవీ హన్సిక చేతిలో ఉన్నవి. ఇన్ని సినిమాల్లో కనిపించనున్నారు కాబట్టే 2022 తనకు చాలా ప్రత్యేకం అంటున్నారామె.

ఇంకా హన్సిక మాట్లాడుతూ – ‘‘గడిచిన రెండేళ్లు అందరికీ ఓ పెద్ద సవాల్‌. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చాలా క్లిష్టమైన పరిస్థితి. 2022లో పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకంతో ఉన్నాం. నా వరకూ వస్తే చేతిలో తొమ్మిది సినిమాలు ఉండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాల్లో కొన్ని షూటింగ్‌ దశలో, విడుదలకు సిద్ధమయ్యే దశలో ఉన్నాయి. ఎంతో పాజిటివ్‌గా ఉంది. ఆ మాటకొస్తే.. ఇప్పుడు అందరం పాజిటివ్‌గా ముందుకు సాగడం అవసరం. ఆ పాజిటివిటీయే మనల్ని నడిపిస్తుంది’’ అన్నారు.