మ‌హేష్ కూతురికి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

happy birthday sitara ghattamaneni

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈ చిన్నారి సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఆట పాట‌ల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి విపరీత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ కూడా ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ చానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. వారానికి ఓ వీడియో షేర్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తాన‌ని సితార తెలిపింది. ఇక‌ ఈ రోజు సితార బ‌ర్త్ డే కావ‌డంతో ఇటు అభిమానులు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సితార‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ ఫ్యాన్స్ సితార పేరుతో అన్న‌దానం, ర‌క్త‌దానంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. మ‌హేష్ ఇప్ప‌టికే కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో త‌న కూతురి బ‌ర్త్‌డే వేడుక‌ల‌లో పాల్గొన‌నున్నాడు.