కో డైరెక్ట‌ర్‌తో గొడ‌వ‌ప‌డ్డ బన్నీ.. క్లారిటీ ఇచ్చిన స‌న్నిహితులు

allu arjun fight with co director

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుతుంది. అయితే సెట్‌లో కో డైరెక్ట‌ర్‌తో బ‌న్నీ దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, దీంతో కో డైరెక్ట‌ర్ బ‌య‌ట‌కి వెళ్లి పోవ‌డంతో షూటింగ్ కూడా ఆగిపోయింద‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై బ‌న్నీ వ‌ర్గం క్లారిటీ ఇచ్చింది. కో డైరెక్ట‌ర్‌తో గొడ‌వ జ‌రిగింద‌నేది అవాస్త‌వం. షెడ్యూల్ విష‌యంలో బ‌న్నీకి కో డైరెక్ట‌ర్ స‌రైన క్లారిటీ ఇవ్వ‌డ పోవ‌డం వ‌ల్ల కాస్త అప్‌సెట్ అయ్యాడే త‌ప్ప ఆయ‌న‌పై సీన్ పేప‌ర్స్ విసిరాడ‌ని వ‌చ్చిన వార్త‌లు అబ‌ద్ధం. ఇక షూటింగ్ క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణం చిత్రంలో న‌టిస్తున్న ఓ సీనియ‌ర్ హీరో వేరే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఆపేశారు అని వివ‌ర‌ణ ఇచ్చారు . ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా పి.ఎస్. వినోద్ ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నది.