22న చింతమడకకు సీఎం కేసీఆర్!

cm kcr chinthamadaka tour schedule fixed

సీఎం కేసీఆర్ తన స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామానికి సోమవారం (ఈ నెల 22న) రానున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చింతమడకకు ఓటువేయడానికి వచ్చినప్పుడు త్వరలోనే మళ్లీ వస్తా.. మీతో ఒక రోజంతా గడుపుతానని గ్రామస్థులకు మాటిచ్చారు. అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో.. గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఇటీవల రూ.10 కోట్లు విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.