నా పెళ్లి గురించి నీకెందుకు ?- నిహారిక

happy-wedding-promotional-video-by-niharika

బ్రేకింగ్ న్యూస్… నాగశౌర్యతో నిహారిక పెళ్లి ఫిక్స్… ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్..?? బాహుబలి ప్రభాస్ – కొణిదెల నిహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు… త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు… రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. చిరంజీవి పెద్ద తరహాగా… ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు… నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది… ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. అయితే ఇదే విషయాన్నీ మెగా డాటర్ నిహారిక కొణిదెలను ఆమె వెడ్డింగ్ గురించి అడగ్గా మండిపడింది.

‘మేడం మేము యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. ఈ మధ్య సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ గురించి బాగా వైరల్ అవుతోంది మేడమ్. దాని గురించి ఏమైనా చెప్తారా?’ అని అడగ్గా నిహారిక ‘అసలు ఎవరయ్యా వీళ్లను లోపలికి రానిచ్చింది? నా పెళ్లి గురించి మీకెందుకయ్యా? నిహారిక ఎవరిని చేసుకుంటుంది? ఎప్పుడు చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? చూస్తే షాక్ అవుతారు… షేక్ అవుతారు… కిందపడి లేస్తారు. పిచ్చామీకేమైనా? మీ థంబ్‌నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?’’ అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది.

ఇంతలోనే ఆ వ్యక్తి ‘మేడమ్ మేము అడిగేది మీ హ్యాపీ వెడ్డింగ్ మూవీ గురించి’ అనగానే.. నీహారిక ‘‘సారీ సారీ సారీ… హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ ఈ జూన్ 30న రిలీజ్ అవుతుంది. అప్పుడు మేము సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతాం ఓకే’’ అంటూ బై చెప్పేసి కారెక్కి వెళ్లిపోయింది. ఇదంతా నిజం కాదు హ్యాపీ వెడ్డింగ్ మూవీ కోసం డిఫరెంట్‌గా క్రియేట్ చేసిన ప్రమోషనల్ వీడియో. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నీహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు. యూత్ లో నిహారికకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఎందుకంటే వారికి ఆమె పలు వెబ్ సిరీస్ ల ద్వారా దగ్గరైంది మరి వాళ్లంతా కూడా ఆమె నుంచి రానున్న సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కొత్త కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.