త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీ నుంచి బరోడా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించి తిరిగి భారత జట్టులోకి వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాండ్యా రంజీ ట్రోఫీలో ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నమెంట్‌లో హార్ధిక్ బౌలింగ్ కూడా చేస్తాడని గంగూలీ పేర్కొన్నాడు.
పాండ్యా టోర్నీ నుంచి వైదొలగడంతో బరోడా జట్టుకు కేదార్ దేవ్‌ధర్ నాయకత్వం వహించనున్నాడు.ఇక కరోనా కారణంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఐపిఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. హార్ధిక్ పాండ్యాతో అహ్మదాబాద్ 15 కోట్లకు ఒప్పందం కుదుర్చకుంది.