జబర్దస్త్‌ యాంకర్‌ హరితేజ ఏంటి బాసూ..!

Hari teja as Jabardasth Anchor

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో విజేత కాలేక పోయినా కూడా హరితేజ మంచి ఫేమ్‌ను మాత్రం సంపాదించింది. హరితేజ ఏకంగా ఎన్టీఆర్‌ హృదయాన్ని కూడా దోచేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీఆర్‌ అభినందనలు అందుకున్న హరితేజ కెరీర్‌ టర్న్‌ అయ్యిందని చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్‌కు ముందు బిస్‌బాస్‌కు తర్వాత అన్నట్లుగా హరితేజ కెరీర్‌ ఉంటుందని అంతా భావిస్తున్నారు. హరితేజ బిగ్‌బాస్‌ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ సైన్‌ చేయలేదు. అయితే ఈమె వద్దకు పెద్ద సినిమా ఆఫర్లతో పాటు, బుల్లి తెరపై పలు ఆఫర్లు వస్తున్నాయి.

గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ‘జబర్దస్త్‌’కు కొత్త యాంకర్‌గా హరితేజను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రష్మీ హీరోయిన్‌గా బిజీ అవ్వడంతో పాటు ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు అనే ఉద్దేశ్యంతో మల్లెమలా వారు హరితేజను సంప్రదించారని, వచ్చే నెలలో జబర్దస్త్‌ టీంతో హరితేజ జత కట్టబోతుందని, నాగబాబు మరియు రోజాలు కూడా హరితేజ యాంకర్‌ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు.

బూతు కామెడీ షోగా పేరున్న జబర్దస్త్‌కు హరితేజ యాంకరింగ్‌ చేస్తుందని తాము భావించడం లేదని, అయినా ఆమె స్టైల్‌కు ఏమాత్రం జబర్దస్త్‌ సూట్‌ అవ్వదని అంటున్నారు. పక్కా వెజిటేరియన్‌ అయిన ఆమె నాన్‌ వెజ్‌ జోకులు ఉండే జబర్దస్త్‌కు ఒకవేళ యాంకరింగ్‌ చేసినా కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుందని, ఆ విషయం షో నిర్వాహకులు ముందే తెలుసుకుంటే బాగుంటుందని అంటున్నారు. హరితేజకు మంచి టైమింగ్‌తో పాటు మంచి ప్రతిభ ఉంది. ఆ కారణంగానే ఖచ్చితంగా జబర్దస్త్‌ యాంకర్‌గా ఎంపిక అయ్యి, మంచి ప్రతిభ చూపించి షోను మరింత సక్సెస్‌ చేస్తుందని ఆమెను అభిమానించే కొందరు అంటున్నారు. మొత్తానికి హరితేజ జబర్దస్త్‌ చేస్తుందా చేయదా, చేస్తే ఎలా ఉంటుంది అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి.