మంత్రి హరీష్ రావు కి కరోనా వైరస్

మంత్రి హరీష్ రావు కి కరోనా వైరస్

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా వదిలి పెట్టడం లేదు. భారత్ లో ఇప్పటికే వేల సంఖ్యలో నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో దేశ ప్రజలు భయ భ్రాంతులకి గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో రోజురోజుకీ పెరుగుతోంది. భారీగా నమోదు అవుతున్న ఈ కేసుల విషయం లో నేడు హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కి కరోనా వైరస్ నిర్దారణ అయింది. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే పలువురు నేతలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నారు. అయితే తాజాగా మంత్రి కి కరోనా వైరస్ సోకడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. గత కొద్ది రోజుల నుండి మంత్రి తో సన్నిహితం గా ఉన్నవారు, కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు.