హరీష్ దర్శకత్వంలో చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్

హరీష్ దర్శకత్వంలో చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూనే ఇప్పుడు సినిమాలు కూడా స్టార్ట్ చేసేసారు.గతంలో ఇచ్చిన పలు కమిట్మెంట్స్ ప్రకారం ఇప్పుడు మళ్ళీ మొహానికి రంగు వేసుకోబోతున్నారు.అయితే పవన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఈ రెండు కాదు గణ ఇప్పుడు ఈరోజు బయటకొచ్చిన వార్తతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యిపోయారు.

పవన్ కెరీర్ లో పదేళ్ల పాటు ఒక సరైన హిట్టు లేని సమయంలో హరీష్ శంకర్ తో తీసిన “గబ్బర్ సింగ్” చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మరోసారి హరీష్ దర్శకత్వంలో ఓ చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ వార్త విన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ట్విట్టర్ లో రచ్చ లేపేస్తున్నారు.ఒక్క పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మహేష్ ఫ్యాన్స్ కూడా పవన్ రీఎంట్రీ ను ఎంతో హ్యాపీగా ఆహ్వానిస్తున్నారు.మొత్తానికి మాత్రం మళ్ళీ పవన్ ఫ్యాన్స్ కు మళ్ళీ పాత రోజులు మొదలయ్యాయి అని చెప్పాలి.