గౌరవం సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయం అయిన తమిళ నటుడు హరీష్ ఉత్తమన్, తర్వాత తాను చేసిన పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, ఎక్సప్రెస్స్ రాజా, దువ్వాడ జగన్నాథం, జై లవకుశ, నా పేరు సూర్య సినిమాలతో తెలుగులో విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు హరీష్ ఉత్తమన్ అంటే తెలుగు మరియు తమిళంలో మంచి పేరున్న ఒక ఉత్తమ విలన్. 36 సవంత్సరాల వయస్సున్న హరీష్ ఉత్తమన్ తన ప్రేయసి అమ్రిత కళ్యాణపూర్ ని కేరళలోని గురువాయూర్ టెంపుల్ లో సాంప్రదాయక పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ అయినా అమ్రిత తో హరీష్ ఉత్తమన్ ది ఐదేళ్ల ప్రేమబంధం. ఈ వివాహానికి ఇరువురు దంపతులకు చెందిన కుటుంబసభ్యులు మరియు కొంతమంది పరిచయస్తులు హాజరయ్యి, నూతన దంపతులను ఆశీర్వదించారు.