శ్రీరామ్ ని టార్గెట్ చేసిన సోషల్ మీడియా

శ్రీరామ్ ని టార్గెట్ చేసిన సోషల్ మీడియా

బిగ్ బాస్ సీజన్ 5 నత్త నడకన సాగుతుంది. మొత్తం ఆటలో మూడోవంతు ముగిసినా ఈ సీజన్ ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోతుంది. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో సింగర్ శ్రీరామ చంద్ర టాప్3 లో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో ఆట మొదలుపెట్టగా.. పదోవారానికి చేరుకునేటప్పటికి హౌస్‌లో 10 మంది మంది మాత్రమే మిగిలారు. వీరిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒక్కడే బాగా ఆడుతున్నాడు . ఫైనల్‌కి వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్స్‌లో శ్రీరామ్ ఖచ్చితంగా ఉంటాడు.

అయితే శ్రీరామ్ ని కావాలనే కొందరు టార్గెట్ చేసి సోషల్ మీడియా లోదుష్ప్రచారం చేస్తున్నారు. లేని పోనీ రుమర్లు క్రియేట్ చేసి ఓట్లు తగ్గించాలని చూస్తున్నారు. శన్ను,సన్నీ,మానస్ అభిమానులు కావాలని శ్రీరామ్ పై నెగటివిటీ  కామెంట్లు చేస్తున్నారు. శ్రీరామ్ కి ఇప్పుడే ఓటింగ్ శాతం పెరగడంతో కావాలనే ఇలా చేస్తున్నారని శ్రీరామ్ అభిమానులు భావిస్తున్నారు. మన అందరి ఆశీస్సులతో శ్రీరామ్ విజయాన్ని సాదించాలని కోరుకుందాం.