దెయ్యాల గురించి మనం సినిమాలోనూ లేక ఎవరైన చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందే లేదో తెలియదు గానీ ఇక్కడొక హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు.
అసలు విషయంలోకెళ్లితే…సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని సోమర్సెట్లోని ఇల్మిన్స్టర్లోని ష్రబ్బరీ హోటల్లో అతిథులు అడుగుజాడలు, వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. ఈ మేరకు ఇన్వెస్టిగేటర్ ఆ హోటల్లో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు.
అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ…” మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం.
అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి తమ జుట్టును పైకి లాగినట్లుగా తాకిన అనుభూతి కలిగిందన్నారు. అంతేకాదు మేము కొన్ని వికృతి ఆకారాలను చూశాం అని చెబుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజిబెత్ కావడం.