మెగాస్టార్ లుక్ చూశారా…ఎలా అయిపోయాడో ?

Have you seen the megastar look

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెరైటీ రొల్స్ ను ఎంచుకుంటూ అభిమానులను షాక్ కి గురిచేస్తున్నారు. గత మంగళవారం నుంచి అమితాబ్ తన కొత్త చిత్రం ‘గులాబో సితాబో’ షూటింగ్ లో పాల్గొన్నారు. సాహోజిత్ సర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అమితాబ్ లుక్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. అమితాబ్ లుక్ చూస్తే కచ్చిత్తంగా షాక్ అవ్వాల్సిందే. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ హైలైట్‌గా ఉండబోతోంది. అమితాబ్ లుక్ ముసలి వాడి గెటప్ , బాగా పెరిగిన గడ్డం తో గుర్తించలేకుండా వుంది. అమితాబ్ ని గుర్తించడం కూడా కష్టంగానే వుంది. ఈసినిమా ఏప్రిల్ 24, 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.