మెగాస్టార్ చిరంజీవికి సమాదానం చెప్పిన ప్రముఖ క్రికెటర్

మెగాస్టార్ చిరంజీవికి సమాదానం చెప్పిన ప్రముఖ క్రికెటర్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో అడుగు పెట్టినప్పటి నుండి చాలా యాక్టిివ్ గా ఉంటున్నారు. లేట్ గా సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చినా చాలా లేటెస్ట్ గా ప్రతి అంశం పై స్పందిస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు బదులుగా సచిన్ టెండూల్కర్ మెగాస్టార్ చిరంజీవి గారికి బదులు ఇచ్చారు. విషెస్ చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సచిన్ టెండూల్కర్ ఇచ్చిన రిప్లై కు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. థాంక్స్ సచిన్ టెండూల్కర్ బ్రదర్ అని వ్యాఖ్యానించారు.అంతా క్షేమం అని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్తతుల్లో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడం లో డిఫెన్స్ అడటమే సరైన విధానం అని, నేను అందరికీ ఇదే విషయం చెబుతున్నా అని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా లో, డిజిటల్ మీడియా లో తనదైన శైలిలో ప్రజలకు కరోనా వైరస్ మహమ్మారి గురించి వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరు నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. చిరు అభిమానులు ఆచార్య చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.