తనదైన శైలిలో బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్

తనదైన శైలిలో బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తనదైన శైలిలో చెప్పారు. ”డాన్స్ లో గ్రేస్ ఆ వయసు నుంచే ఉంది. బన్నీ లోని కసి, కృషి నాకు చాల ఇష్టం. హ్యాపీ బర్త్ డే బన్నీ, నువ్వు బాగుండాలబ్బా..” అని చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. బన్నీ పట్ల చిరంజీవికి ఉన్న ప్రేమ ఈ ట్వీట్ లో అర్థం అవుతుంది. ఇక ఆ ట్వీట్ లో చిరంజీవి చిన్నప్పుడు బన్నీ డాన్స్ చేస్తుంటే, చిరంజీవి ఎంకరేజ్ చేస్తున్న ఫోటో పంచుకున్నారు. ఆ ఫొటోలో బన్నీ, చిరు ఒకే రకమైన డిజైన్ ఉన్న షర్ట్స్ ధరించి ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక బన్నీ తన తదుపరి చిత్రం క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తుండగా, ఆ చిత్రానికి సంబందించిన కీలక అప్డేట్ నేడు వచ్చింది. బన్నీ తన 20వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ పుట్టిన రోజును పురస్కరించుకుని విడుదల చేశారు. బన్నీ గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ టైటిల్ భిన్నంగా పుష్ప అనే సాఫ్ట్ టైటిల్ ఈ మూవీ కోసం ఉపయోగించారు. బన్నీ లుక్ చాలా రఫ్ అండ్ ఇంటెన్స్ కలిగివుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.