బన్నీని ట్రోల్ చేస్తున్న మెగా ఫాన్స్

బన్నీని ట్రోల్ చేస్తున్న మెగా ఫాన్స్

మెగా హీరోగా మెగా ఆశీస్సులతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే.. కానీసం వాళ్ల పేరుని కూడా చెప్పడానికి ఇష్టం లేదు బ్రదర్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కాలింది. అసలే పవన్ ఫ్యాన్ పైగా ఇగో హర్ట్ అయితే రచ్చ మామూలుగా ఉండదుగా.. అల్లు అర్జున్‌కి సంబంధించిన ఏది వచ్చినా దాన్ని పనికట్టుకుని డిస్ లైక్స్ చేసేవారు. అప్పట్లో దువ్వాడ జగన్నాథం టీజర్, ట్రైలర్‌లు డిస్ లైక్స్‌తో రికార్డుల కెక్కాయి అంటే అది పవన్ ఫ్యాన్స్ చేసిన పనే అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు.అయితే ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది కదా.. ప్రతి హీరో సినిమాకి వెళ్లి పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవడం కరెక్ట్ కాదని నాగబాబుతో సహా అందరూ చురకలేశారు.

అరే ఇదంతా అయిపోయి ముచ్చట. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో బన్నీ కలవడం. ఇద్దరి మధ్య సమస్యసమసిపోవడం జరిగిపోయింది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంటే బన్నీ కూడా. మెగా హీరోల్లో బన్నీ కూడా టాప్ స్టార్. పలు సందర్భాల్లో సైతం బన్నీ.. తమకి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది అంటే అది కేవలం చిరంజీవి గారు మాకు ప్లాట్ ఫామ్ వేయడం వల్లే అని చెప్పారు కూడా.అయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయిన సందర్భంగా థాంక్స్ చెప్తూ ఫేస్ బుక్‌ల పెట్టిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ మధ్య మళ్లీ చిచ్చు పెట్టింది.

గంగోత్రి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. 17 ఏళ్లుగా తనని సపోర్ట్ చేస్తూ వస్తున్న తెలుగు ప్రేక్షకులకు అలాగే తన ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగోత్రి సినిమాతో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు, అలాగే చిత్ర నిర్మాతలుగా ఉన్న అశ్వనీదత్, అల్లు అరవింద్‌లకు ఆ చిత్రంలో నటీనటీనటులకు, టెక్నీషియన్‌లకు థాంక్స్ తెలియజేశారు.కాగా ఈ పోస్ట్‌లో ఎక్కడా మెగా స్టార్ ప్రస్తావన లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.