నిన్ను మిస్ అవుతున్నా.. బాయ్ ఫ్రెండ్ కు గుత్తాజ్వాల ట్వీట్ వైరల్.

ప్రపంచమంతా కరోనాతో వణికిపోతుంది. కానీ.. ప్రేమికులు మాత్రం వారి ఎడబాటును, విరహాన్ని కొన్ని రోజుల పాటు అస్సలు ఆపుకోలేకపోతున్నారు. వైరాగ్యంతో చిందులు వేస్తున్నారు. తమ బాధ ప్రపంచపు బాధగా తల్లడిల్లిపోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ కారణంగా విమానాలతో పాటు రవాణా మొత్తం ఆగిపోయింది. ప్రపంచమే నిశ్శబ్దంగా మారింది. వైరస్ దెబ్బకు ప్రజానీకం ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి దాపురించింది. రవాణా లేకపోవడంతో ఎంతో మంది ఎక్కడివారు అక్కడ ఉండాల్సి వస్తుంది. తమ వారికి దూరంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జాబితాలో సీనియర్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఉన్నారు. ఆమె త‌న బాయ్ ప్రెండ్, హీరో విష్ణు విశాల్‌ ను తెగ మిస్ అవుతోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అనే రీతిలో కాకుండా.. విరహం మరీ ఎక్కువైపోయి.. నిన్ను మస్ అవుతున్నా విశాల్ అంటూ పోస్ట్ పెట్టేసింది. కొంపదీసి బ్రేకప్ అంటూ అంతా కంగారు పడ్డారు. కానీ.. అదేం లేదు.. ప్రస్తుతం జ్వాల హైదరాబాద్ లో ఉంటే.. విష్ణు విశాల్ చెన్నైలో ఉన్నాడు. ఇక జ్వాల ట్వీట్ ను చూసిన విష్ణు.. ‘ప‌ర్లేదు… ప్ర‌స్తుతానికి సామాజిక దూరం ముఖ్యం. అందరి ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం’ అంటూ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కాగా.. వీరిద్దరూ గత కొంతకాలంగా తెగ ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద‌రి ఫొటోలు ఆమధ్య నెట్టింట్లో కూడా వైర‌ల్ కావడం విశేషం.