కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు మఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందే కోవిడ్ నిర్ధారణ రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో నాకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్భంధంలో ఉండండి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి’ అని దుష్యంత్ ట్వీట్ చేశారు.