నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజులో సాధించింది ఈ చిత్రం . జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద700 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. ఇక జైలర్ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో జైలర్ మూవీ విడుదలైంది. అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది జైలర్ . ఇక ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ రజినీకాంత్, నెల్సన్, అనిరుధ్ కు కాస్ట్లీ గిఫ్ట్స్ ను అందించారు. తాజాగా జైలర్ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్.ఈ ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా సక్సెస్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ జైలర్ మూవీ తో భారీ విజయాన్ని అందుకున్నారు.
తాజాగా ‘జైలర్’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అనిరుధ్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. సినిమా విజయానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏ .. కారణమని ఆయన అన్నారు. మూవీ సూపర్ హిట్ అవ్వడానికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎం కారణమని కూడా అన్నారు సూపర్ స్టార్. నేనే కాదు మూవీ చుసిన ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నిజం చెప్పాలంటే రీరికార్డింగ్‌కి ముందు మూవీ చూసినప్పుడు అంతగా అనిపించలేదు. యావరేజ్‌గా ఉందనిపించింది. మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత మూవీ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది అన్నారు. తన మ్యూజిక్ తో అనిరుధ్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్నాడు. నా సినిమా హిట్ అవ్వాలన్నదే అతని కోరిక’ అని రజనీకాంత్ అన్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ వయసు 72. జైలర్ మూవీ లో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి కానీ రజినీకాంత్ ఫైట్ చేయరు. అయితే అనిరుధ్ ఇచ్చిన బీజీఎం మూవీ కి కొత్త ఎనర్జీని ఇచ్చింది. జైలర్ మూవీ భారీ విజయానికి అనిరుధ్ సంగీతమే కారణం అని ప్రేక్షకులంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా ఇదే మాట చెప్పారు. అంతే కాదు అనిరుధ్‌ని రజనీ నా కొడుకు అని కూడా అన్నారు. ఇక జైలర్ మూవీ లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ , సునీల్ అతిథి పాత్రల్లో కనిపించారు. తమన్నా స్పెషల్ రోల్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది.