ముఖ్యంగా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం జరిగింది. అయితే ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. దానితో పాటుగా సరైన జీవన విధానం కూద ఉండాలి. సరిపడా నీళ్లు తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం వంటివి కూడా ఫాలో అవుతూ ఉండాలి.ఆరోగ్యంగా ఉంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా చలి కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎటువంటి సమస్యలు కూద సంభవించకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే చలి కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో క్యారెట్ కూడా ఒకటి. నిజానికి క్యారెట్ వల్ల చాలా రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. కంటి ఆరోగ్యానికి కూడా క్యారెట్ బాగా ఉపయోగ పడుతుంది. ఒంట్లోని కొవ్వును కరిగించడానికి కూడా క్యారెట్ మనకు సహాయ పడుతుంది. మనల్ని యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటుంది.
అలాగే ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సమస్యలను నివారిస్తాయి. హైబీపీతో బాధపడే వాళ్లకు కూడా క్యారెట్ బాగా ఉపయోగ పడుతుంది. తరచుగా క్యారెట్స్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా క్యారెట్ బాగా హెల్ప్ చేస్తుంది. క్యారెట్లో వుండే విటమిన్స్ జుట్టు పొడిబారకుండా ఉంచుతాయి. ఇలా క్యారెట్ వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి. క్యారెట్లకు సంబంధించి లైఫ్ స్టైల్ కోచ్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ విషయాల గురించి చూసేద్దాం.
క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎన్నో పోషక పదార్ధాలు ఇందులో నిండి ఉంటాయి. క్యారెట్లను మనం నములుతూ తీసుకోవడం వల్ల పంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదే విధంగా క్యారెట్లను డైట్లో తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే చలి కాలంలో క్యారెట్లను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.
క్యారెట్లను తీసుకునేటప్పుడు పచ్చివి కానీ జ్యూస్ గాని తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు జ్యూస్‌ని తీసుకోవాలి అని అనుకుంటే ఫైబర్‌ను తొలగించకుండా తీసుకోండి. అంటే జ్యూస్‌ని మీరు అసలు వడకట్టొద్దు. ఇలా చేయడం వల్ల మీకు ఫైబర్ కూడా అందుతుంది. దీంతో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌తో మనం చాలా రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తో కర్రీ, ఫ్రై, హల్వా ఇలా చాలా రకాల వంటకాలను చేసుకో వచ్చు.
పచ్చి క్యారెట్‌ని కూడా తినొచ్చు లేదంటే క్యారెట్ తురుమును కూడా తీసుకుని వంటల్లో వాడుకోవచ్చు. అయితే నిజానికి క్యారెట్‌ని ఎలా తీసుకున్నా సరే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కాన్సర్‌తో బాధ పడుతున్న వాళ్లు ఆర్గానిక్ క్యారెట్స్ని ఉపయోగించాలి అదే విధంగా తొక్క తీసి క్యారెట్‌ని తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తొలగి పోతుంది. క్యారెట్‌ని సూప్ కూడా చేసుకుని తీసుకో వచ్చు.
అదే ఒకవేళ మీరు డయాబెటిస్తో బాధ పడుతున్నట్లైతే క్యారెట్ జ్యూస్ తీసుకోవడం మంచిది కాదు. క్యారెట్ పచ్చిగా తీసుకుంటే సరిపోతుంది. లేదంటే షుగర్ వంటివి యాడ్ చేయకుండా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు క్యారెట్ వల్ల కలిగే ప్రయోజనాలు చూశారు కదా క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకొని తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది.
క్యారెట్ జ్యూస్ ని చేయడం అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు. అలాగే క్యారెట్ జ్యూస్ తీసుకునేటప్పుడు దానిని అసలు వడకట్టకుండా తీసుకుంటే మంచిది. ఫ్రెష్ లేదా డ్రైడ్ పార్స్లీ వేసుకుని తీసుకుంటే బ్రెస్ట్ కాన్సర్ సమస్య రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ని ఒక డ్రాప్ లేదా రెండు డ్రాప్స్‌ని ఈ జ్యూస్‌లో వేసుకుంటే మంచిది లేదంటే కొబ్బరి నూనెను కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ కీరా లేదా అల్లం, వెల్లుల్లి, మిరియాలు కూడా జ్యూస్‌లో వేసుకో వచ్చు.
అన్ని ఆహార పదార్థాలు లాగే క్యారెట్ జ్యూస్‌ని కూడా మోడరేషన్లో తీసుకుంటే మంచిది.ఇలా క్యారెట్ జ్యూస్ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. చూశారు కదా ఆరోగ్యం బాగుండాలంటే ఏ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి అనేది. మరి ఆ విధంగా అనుసరించి సమస్యల నుండి దూరంగా ఉండండి అలానే ఏ అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉండండి.