బార్లీ వల్ల ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే వదలరు !

Health benefits of barley seeds

నేటి జంక్ ఫుడ్ తరంలో ఒబేసిటీ పెద్ద సమస్యగా మారింది. తినాల్సిన ఆహారం కాకుండా జంక్ ఫుడ్ కారణంగా విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. ఒక పద్దతి లేకుండా తినేయడం, తర్వాత బరువు తగ్గించుకునేందుకు తంటాలు పడడం చాలా మందికి షరా మామూలు అయ్యింది. బరువు తగ్గడంకోసం హెర్బల్ ఫుడ్, డైటింగ్ వంటివి చేస్తుంటారు. ఇలా కాకుండా సులువుగా బరువు తగ్గేందుకు ఒక మార్గం మీ కోసం బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

బార్లీ వల్ల కలిగే ప్రయోజనాలు :

పీచు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాల్లో బార్లీ కూడా ఒకటి.
బార్లీ గింజలు పేగుల్లో వుండే మలినాలను తొలగిస్తాయి.
బార్లీ గింజలు కేన్సర్ ని నియంత్రిస్తాయి.
బార్లీ గింజలను తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా వుంటాయి.
బార్లీని తీసుకుంటే కీళ్లనొప్పులు దూరమవుతాయి.
బార్లీ గింజలను మెత్తగా ఉడికించాక ఆ నీటిని వడగట్టి అర గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు.
ప్రతిరోజూ సూప్, సలాడ్తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
బార్లీ గింజల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గించే యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. చర్మానికి ఇవి మెరుపు తీసుకొస్తాయి. రెగ్యులర్గా బార్లీ గింజలతో కూడిన ఆహారాన్ని మన దినవారీ డైట్టో భాగం చేసుకుంటే మన జీర్ణ వ్యవస్థ సైతం శుద్ధి అవుతుంది.