జీడిపప్పుతో ఇన్ని లాభాలు…

Health-Benefits-Of-Cashew-N
  • శరీర విధులు నిర్వహించటానికి కావలసిన అన్ని రకాల పోషకాలను వీటి నుండి పొందవచ్చు.

  • క్యాన్సర్’కు కారణమైన కణ విభజనను వ్యతిరేకించే మూలకాన్ని కలిగి ఉంటుంది.

  • గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే ‘ఒలిక్ ఆసిడ్’ను పుష్కలంగా కలిగి ఉంటుంది.

  • జీడిపప్పు మెగ్నీషియంను కలిగి ఉండటం వల్ల అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తుంది

‘కాజు’ అని జీడిపప్పు ని పిలుస్తుంటారు. సాధారణంగా వీటిని స్వీట్’ల తయారీలో,మాములుగా తింటూ కూడా ఉంటాం శరీర విధులు సరిగా నిర్వహించటానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అనగా, విటమిన్’లు, మినరల్’లు అన్ని జీడిపప్పులో ఉంటాయి.బ్రెజిల్’కి చెందినా విత్తనాలు, 16 వ శతాబ్దంలో ఇవి భారతదేశంలోకి తీసుకు రావటం జరిగింది.వీటి ద్వారా పోషకాలు అందించబడటమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కలుగచేసే వాటితో పోరాడుతుంది.

ట్యూమర్’లను ఏర్పరిచే విధిని నివారించే ఫ్లావనాయిడ్’లు అయినట్టి ”ప్రో-ఆంతోసైయనైడ్”లు జీడిపప్పులో పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో ఉన్న ఈ ప్రో-ఆంతోసైయనైడ్’లను మరియు కాపర్ మూలకం క్యాన్సర్’ను వ్యాప్తి చెందించే కారకాలకు వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తాయి. ముఖ్యంగా, కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీడిపప్పు వలన కలిగే ప్రయోజనాలలో ఇది ప్రత్యేకం అని చెప్పవచ్చు.

గుండె ఆరోగ్యం
ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ‘ఒలిక్ ఆసిడ్’ కూడా ఇందులో ఉంటుంది. కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ-ఆక్సిడెంట్’లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

కండరాల ఆరోగ్యం
ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతల ఉండి, కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి, రక్తనాళాలను మరియు కండరాలను విశ్రాంతికి చేసూరుస్తుంది. కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడినట్లయితే, కాల్షియం రక్తనాళాలలోకి చేరుతుంది. ఫలితంగా అధిక రక్త పీడనం, మైగ్రిన్ మరియు తలనొప్పి కలిగే అవకాశం ఉంది. జీడిపప్పులో మెగ్నీషియం మూలకం అధిక మొత్తంలో ఉండి ఈ చర్యను నివారించి, ఈ రకమైన వ్యాధులను, సమస్యలను కలుగకుండా కాపాడుతుంది.

జుట్టుకు ఉపయోగకరం
మీ జుట్టు నల్ల రంగులో, ఆరోగ్యకరంగా ఉండుటకు కావలసిన మూలకం కాపర్. కాపర్’ను అధిక మొత్తంలో కలిగిన జీడిపప్పును తినటం వలన నల్లటి జుట్టును పొందుతారు. బాల నెరువు లేదా నెరిసిన జుట్టు ఉన్నవారు రోజు జీడిపప్పు తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

బరువు తగ్గుటలో సహాయం

జీడిపప్పును కొవ్వు గల విత్తనాలుగా పేర్కొంటారు. అవును నిజమే! జీడిపప్పు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందిస్తుంది. జీడి పప్పు తినని వారితో పోలిస్తే, వారంలో రెండు సార్లు తినే వారు తక్కువ బరువు ఉంటారు.

విటమిన్’లు
శరీరానికి కావాలసిన అన్ని రకాల విటమిన్’లు జీడిపప్పులో ఉంటాయి. ‘రిబోఫ్లావిన్’, ‘పాంటోథీనిక్ ఆసిడ్’, ‘థైయామిన్’, ‘నియాసిన్’ వంటి విటమిన్’లు జీడిపప్పులో ఉంటాయి. ‘అనిమియా’ మరియు ‘పెల్లాగ్రా’ వంటి వ్యాధులు కలుగకుండా చూస్తుంది.

ఇతర ప్రయోజనాలు
జీడిపప్పులో ఎక్కువ శాతం మెగ్నీషియం ఉండటం వలన అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు జీడి పప్పులో పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినటం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.రోజు జీడిపప్పును తినటం వలన మూత్ర పిండాలలో రాళ్ళ ఏర్పడటం తగ్గుతుంది