వాతాన్ని విరగ్గొట్టే అల్లం…

Health Benefits of Ginger

అల్లం చాలా ఉత్తమమైన ఔషధ గుణాలు కలిగి వుంది వాతాన్ని విరక్కొట్టటం లో అల్లం పనితీరు అద్భుతం అంతే కాదు అల్లాన్ని వంటల్లో కూడా విరివిగా వాడతారు. జీర్ణకోశ వ్యాధుల దగ్గర నుంచి సమస్త పైత్యపు లక్షణాలను, సమస్త వాతలక్షణాలనూ తొలగించే గుణం అల్లానికి ఉంది.

 • నోటికి సహించకపోవడం అరుచి ఉంటే అల్లాన్ని భోజనానికి ముందు తినాలి. ఇలా అల్లం తినడం వల్ల ఆహారం జీర్ణమవడమే కాక వాంతి వచ్చే స్థితికి కూడా తొలగిపోతుంది.

 • అల్లాన్ని సన్నని చిన్న చిన్న ముక్కలుగా తరిగి లేదా మెత్తగా దంచినా సరే అందులో సైంధవ లవణం లేక మామూలు ఉప్పు అయినా సరే కలిసి రోజూ ఒక చెంచాను నిల్వ చేసుకోవాలి. దీనికి రోజూ చెంచాడు మోతాదులో అన్నంతో కలుపుకుని కొంచెం నెయ్యి వేసుకొని మొట్టమొదటి ముద్ద తినాలి.

 • జీర్ణవ్యవస్థలో వాతపు లక్షణాలను అల్లం హరించి వేస్తుంది. దీని వల్ల మిగిలిన శరీరంపైన వాతపు లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి.

 •  పక్షవాతం వచ్చేటట్లు కనిపిస్తే వెంటనే నాలుగు చెంచాల అల్లపు రసం ఇవ్వాలి. ఈ విధంగా తరచుగా ఇస్తే పక్షవాతం రాకుండా ఉంటుంది.

 •  ఒకవేళ పక్షవాతం అప్పటికే వచ్చినా వ్యాధి ఉదృతంగా మారకుండా ఉంటుంది.

 • అల్లపు రసం కేవలం పక్షవాతానిఏ కాక మోకాలిపోట్లు, మడమశూల, సియాటికా అనే నడుపునొప్పిని కూడా నివారిస్తుంది.

 •  జాయింట్లలో వచ్చే నొప్పులను కూడా అరికడుతుంది. అల్లం జీర్ణవ్యవస్థపై పనిచేస్తుంది. సుఖ విరేచనానికి అల్లానికి మించినది లేదు

 • ఆయుర్వేద వైద్య విధానంలో విరేచనాన్ని కలిగించే వ్యాధుల్ని నయం చేయడం అనే పద్ధతిగా కూడా ఒకటి ఉంది. అల్లం చేసే పని కూడా అలాంటిదే.

 •  అల్లం విరేచనాల్ని సాఫీగా అయ్యేట్లు చేస్తుంది. అంతేగానీ ఇది విరేచనకారి కాదు. అల్లం కంఠాన్ని శుద్థి చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.

 • నాలుకపైన కంఠంలో ఏదో ఉండపెట్టినట్లు ఉండడంతో పాటుగా నోటికి రుచి తెలియపోవడాన్ని కూడా అల్లం పోగొడుతుంది

 • భోజనంలో అల్లం గనుక ఉంటే భోజనానంతరం కనిపించే భుక్తా యాసం అనేది కనిపించదు. అల్లం అతిగా తింటే వేడి చేస్తుంది.

 • పరిమితంగా అల్లాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులకు పట్టిన కఫం కరిగిపోతుంది. జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఇంకా ఇతర ఎలర్జీ లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి.

 • అల్లాన్ని బెల్లాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా దంచి చిన్న కుంకుడు కాయ సైజులో ఉండలు చేసుకుని పూటకు ఒకటి లేక రెండు వుండల్ని తింటే ముక్కు నుంచి ధారాపాతంగా నీరుకారుతూ ఉండే జలుబు కూడా తగ్గిపోతుంది

 • జలుబుతో పాటుగా దగ్గు కూడ ఉండే జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబుతో పాటుగా దగ్గు కూడా ఉంటే మిరియాలు కూడా వీటితో పాటు కలిపి దంచి కలిపి ఇవ్వవచ్చు.

 •  వేడి చేయనంత కాలం వీటిని ఈ విధంగా వాడుకోవచ్చు.

 • లివర్‌ ఎన్‌లార్జిమెంట్‌ ఉన్న వారు కడుపునొప్పితో బాధపడేవారు. కడుపులో మంట ఉన్న వారు లివర్‌ వ్యాధులు ఉన్న వారు రక్తహీనత ఉన్న వారు అల్లాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది.

 • క్షయ వ్యాధి ఉన్న వారు అల్లం ప్రతిరోజు వాడితే క్షయ వ్యాధి తగ్గుతుంది.

 • సోరియాసిస్‌ అనే చర్మవ్యాధిలో చర్మం పొలుసుగా పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది.

 •  అల్లం సమాన పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే సోరియాసిస్‌ వ్యాధిలో వచ్చే ఎలర్జీ లక్షణాలు తొలగిపోతాయి.