లంవంగాలు.. సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. మన ఇంట్లోని పోపుల డబ్బాల కచ్చితంగా ఉంటుంది. దీన్ని వంటల్లో వేస్తే.. ఘుమఘుమలాడుతూ.. వాసన గుప్పుమంటుంది. బిర్యానీ, మసాలా కూరల్లో.. ఇది లేకపోతే టేస్ట్ తేడా్గానే ఉంటుంది.లవంగాలు కూరల్లోనే కాదు.. మన ఇంట్లో పెద్దవారు వట్టిది తినడానికీ ఇష్టపడతారు. మరి లవంగాలు వంటలకు మంచి టేస్ట్ ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికీ అంతే మంచిది. లవంగాలని వంటకాలతో పాటు, కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. లవంగాలు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ,సీ అలాగే.. అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
లవంగాల్లో ఉండే సమ్మేళనాలు.. కేన్సర్ నుంచి రక్షిస్తాయి. లవంగం నూనె కణితుల పెరుగుదలను ఆపుతుందని, కేన్సర్ కణాలు చనిపోయేలా చేస్తుందిని కొన్ని ఆధ్యయనాలలో తేలింది. కన్సన్ట్రేటెడ్ లవంగం నూనె.. 80 శాతం కేన్సర్ కణాలు చేనియేలా చేసిందని మరో అధ్యయనం వెల్లడించిది. లవంగాలలో ఉండే యూజినాల్లో కేన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. యూజీనాల్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
లవంగాలు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మధుమేహాన్ని తగ్గించడానికి లవంగాలు ఉపయోగపడతాయి. మధుమేహం ఉన్నవారు వారి ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే మంచిది.లవంగాలు తీసుకుంటే.. జీవక్రియ పెరగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నా.. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా.. నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. అజీర్తితో బాధపడేవాళ్లు భోజనానికి ముందు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే మంచిది.
శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి, బరువు తగ్గడానికి లవంగాలు తోడ్పడతాయి.వేయించిన లవంగాలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే పొడి దగ్గు తగ్గుతుంది.వేడినీళ్లలో లవంగాలను వేసుకుని తాగితే కడుపులో ఉండే బ్యాక్టీరియా పోతుంది. నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. గ్రీన్‌టీలో లవంగాలను వేసుకుంటే మీకు మరిన్ని పోషకాలు అందుతాయి.తలనొప్పి, వాంతులతో బాధిస్తున్నప్పుడు.. చిటికెడు లవంగాల పొడిలో అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది.
రక్తపోటుకు నివారణకు లవంగం చక్కటి పరిష్కారం. లవంగాలను నమలడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొన్ని రోజులు దీన్ని ప్రయత్నించండి. తేడా కనిపిస్తుంది.లవంగాలను అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. లవంగాలను అధికంగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. అలసటకు దారితీస్తుంది. లవంగాలు ఎక్కువగా తింటే.. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.లంవంగాలు.. సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. మన ఇంట్లోని పోపుల డబ్బాల కచ్చితంగా ఉంటుంది.
దీన్ని వంటల్లో వేస్తే.. ఘుమఘుమలాడుతూ.. వాసన గుప్పుమంటుంది. బిర్యానీ, మసాలా కూరల్లో.. ఇది లేకపోతే టేస్ట్ తేడా్గానే ఉంటుంది.లవంగాలు కూరల్లోనే కాదు.. మన ఇంట్లో పెద్దవారు వట్టిది తినడానికీ ఇష్టపడతారు. మరి లవంగాలు వంటలకు మంచి టేస్ట్ ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికీ అంతే మంచిది. లవంగాలని వంటకాలతో పాటు, కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. లవంగాలు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ,సీ అలాగే.. అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
లవంగాల్లో ఉండే సమ్మేళనాలు.. కేన్సర్ నుంచి రక్షిస్తాయి. లవంగం నూనె కణితుల పెరుగుదలను ఆపుతుందని, కేన్సర్ కణాలు చనిపోయేలా చేస్తుందిని కొన్ని ఆధ్యయనాలలో తేలింది. కన్సన్ట్రేటెడ్ లవంగం నూనె.. 80 శాతం కేన్సర్ కణాలు చేనియేలా చేసిందని మరో అధ్యయనం వెల్లడించిది. లవంగాలలో ఉండే యూజినాల్లో కేన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. యూజీనాల్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
లవంగాలు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మధుమేహాన్ని తగ్గించడానికి లవంగాలు ఉపయోగపడతాయి. మధుమేహం ఉన్నవారు వారి ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే మంచిది.లవంగాలు తీసుకుంటే.. జీవక్రియ పెరగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నా.. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా.. నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. అజీర్తితో బాధపడేవాళ్లు భోజనానికి ముందు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే మంచిది.శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి, బరువు తగ్గడానికి లవంగాలు తోడ్పడతాయి.వేయించిన లవంగాలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే పొడి దగ్గు తగ్గుతుంది.
వేడినీళ్లలో లవంగాలను వేసుకుని తాగితే కడుపులో ఉండే బ్యాక్టీరియా పోతుంది. నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. గ్రీన్‌టీలో లవంగాలను వేసుకుంటే మీకు మరిన్ని పోషకాలు అందుతాయి.తలనొప్పి, వాంతులతో బాధిస్తున్నప్పుడు.. చిటికెడు లవంగాల పొడిలో అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది.రక్తపోటుకు నివారణకు లవంగం చక్కటి పరిష్కారం. లవంగాలను నమలడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొన్ని రోజులు దీన్ని ప్రయత్నించండి. తేడా కనిపిస్తుంది.లవంగాలను అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. లవంగాలను అధికంగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. అలసటకు దారితీస్తుంది. లవంగాలు ఎక్కువగా తింటే.. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.