పువ్వు తింటే బీపి కంట్రోల్‌

పువ్వు తింటే బీపి కంట్రోల్‌

ఇది ఇలా ఉంటే అత్యధికంగా కుంకుమ పువ్వును ఇరాన్‌లో పండిస్తారు. ఇండియాలో కాశ్మీర్‌లో ఎక్కువగా కుంకుమ పువ్వు పండుతుంది. అయితే కుంకుమ పువ్వు గురించి కుంకుమ పువ్వుని ఎలా ఆహార పదార్ధాల్లో ఉపయోగించాలి..?, కుంకుమ పువ్వుని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని గురించి పూర్తిగా చూసేయండి.

కుంకుమ పువ్వుని గర్భిణీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కేవలం గర్భిణీలు మాత్రమే కాదు ఎవరైనా సరే కుంకుమ పువ్వును ఉపయోగించొచ్చు. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలా రకాల సమస్యలను తరిమికొట్టడానికి కుంకుమ పువ్వు మనకు ఉపయోగపడుతుంది. ఆస్తమా, మలబద్ధకం, కాన్సర్, గుండె సంబంధిత సమస్యలు ఇలా చాలా సమస్యల నుండి బయట పడేస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి సమస్య కూడా కుంకుమ పువ్వుతో దూరమవుతుంది.

ఎక్కువగా కుంకుమ పువ్వుని బ్యూటీ ట్రీట్ మెంట్‌లో వాడతారు. చాలా రకాల ఫేస్ ప్యాక్స్ వంటి వాటిలో కుంకుమ పువ్వుని వాడతారు. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు కుంకుమ పువ్వుతో ఎన్నో లాభాలు పొందొచ్చు. నిజానికి కుంకుమ పువ్వులో చాలా విభిన్నమైన ఫ్లేవర్ ఉంటుంది. అలానే సువాసన కూడా ఉంటుంది. ఏ వంటలో వేసిన ఇది అద్భుతమైన రుచిని దానికి తీసుకువస్తుంది. చాలా మంది బిర్యానీ రెసిపీలో కూడా కుంకుమ పువ్వుని వాడుతూ ఉంటారు.

పూర్వ కాలం నుండి చాలా వంటకాలలో కుంకుమ పువ్వుని వాడడం జరుగుతోంది.కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా తియ్యగా ఉంటుంది. అలానే మంచి సువాసన ఉంటుంది. దీని రుచి చాలా విభిన్నంగా ఉంటుంది. దీనిని కనుక ఏ వంటలో వేసిన అందులో కుంకుమ పువ్వు వాడారని సులువుగా పసిగట్టవచ్చు.ఇప్పటివరకు కుంకుమ పువ్వు గురించి చూసాము కదా అయితే కుంకుమ పువ్వుని ఆహార పదార్థాలను ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. పూర్వ కాలం నుండి ఈ ఖరీదైన స్పైస్‌ని వంటలలో వాడడం జరుగుతోంది.

బిర్యానీ, కూరలు ఇలా చాలా డిషెస్‌లో కుంకుమ పువ్వు వేస్తారు ఆయుర్వేదం ప్రకారం ఒరిజినల్ కుంకుమ పువ్వు రెండు నుంచి మూడు రేకులు వేస్తే సరిపోతుంది.నిజానికి ఇది మంచి ఫ్లేవర్‌ని తీసుకు వస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కుంకుమ పువ్వు బాగా ఉపయోగ పడుతుంది. అలానే డిప్రెషన్, పీఎంఎస్ సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. బిపి తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే హార్ట్ ఎటాక్ సమస్య రాకుండా చూస్తుంది.

కుంకుమ పువ్వుని ప్యాక్ చేయడానికి మరియు తయారు చేయడానికి ఎంతో ఎక్కువ లేబర్ అవసరం. కుంకుమ పువ్వు ఏరడం, కోయడం ఇలా చేతితో చాలా పని ఉంటుంది. ఒక పౌండు కుంకుమ పువ్వు తయారు చేయడానికి 75వేల కుంకుమ పువ్వులు అవసరం. ఒక పువ్వులో కేవలం మూడు రేకులు మాత్రమే ఉంటాయి అందుకనే ఎక్కువ ఖరీదు.చాలా రకాల వంటల్లో మనం దీనిని వాడచ్చు. బిర్యాని నుండి పాల వరకు ఎన్నో వాటిలో మనం ఉపయోగించవచ్చు.

మీరు ఒకసారి కుంకుమ పువ్వు దంచి వాడితే ఫ్లేవర్ బాగా పడుతుంది. దంచిన కుంకుమ పువ్వులో కొద్దిగా సాల్ట్ లేదా పంచదార క్యూబ్ వేసి బాగా దీనిని దంచి అందులో పావు కప్పు గోరు వెచ్చని నీళ్ళు వేయండి ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్‌లో వేసి టైట్‌గా ఉండేటట్టు మూత పెట్టండి. దీనిని మీరు వంటల్లో ఉపయోగిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు అనుసరించి చక్కగా కుంకుమ పువ్వుని స్టోర్ చేసి మీకు నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా దీనిని ఎలా వాడాలి, కలిగే లాభాలు ఏమిటి అనేది. మరి వీలైతే దీనిని వాడి ఆ సమస్యల నుండి బయట పడండి.