శిశువు జన్మించిన తరువాత మగవారిలో కొత్త సమస్య

శిశువు జన్మించిన తరువాత మగవారిలో కొత్త సమస్య

మానసిక సమస్యలు వస్తాయి. అచ్చం మహిళలు లాగే పురుషుల్లో కూడా శిశువు జన్మించిన తరువాత హార్మోన్ లెవెల్స్ మారతాయి. కొత్త జీవితానికి ఎడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఈరోజు పురుషుల్లో పోస్టుపార్టం డిప్రెషన్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాము. దీనితో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.శిశువు జన్మించిన తరువాత తల్లిదండ్రులు ఎడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది.

తమ శిశువులు చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాటిని ఇవ్వడం మరియు వాళ్ళ పనులు చేయడం నిజంగా ఇవన్నీ కాస్త కష్టంగా ఉంటాయి.శిశువు జన్మించిన తరువాత కాస్త ఒత్తిడి మరియు అలసిపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఒకరి నుండి మరొకరికి వీటి యొక్క లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని చూస్తే మీకు ఒక క్లారిటి వస్తుంది.ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, నిద్ర పట్టకపోవడం, నొప్పులు ఉండడం, ఆసక్తి లేకపోవడం, బాధగా ఉండడం, గిల్టీగా ఉండడం, బాధ ఎక్కువగా ఉండడం లాంటివి కనపడతాయి.

శిశువు జన్మించిన తరువాత అందరి మగవారిలో ఇవి కనబడతాయి. కానీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా మంది చేయించుకోరు. డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 8 శాతం తండ్రులు డిప్రెషన్‌కి లోనవుతారు.అయితే ఈ డిప్రెషన్ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే. డిప్రెషన్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అఫ్ డిప్రెషన్, ఆర్థిక సమస్యలు, సోషల్ లేదా ఎమోషనల్ సపోర్ట్ లేక పోవడం, తండ్రి బాధ్యతలు తలుచుకుని బాధ పడడం, కుటుంబ సభ్యులు లేదా భార్యతో ఉండే రిలేషన్షిప్ పైన ఒత్తిడి కనిపించటం ఇలాంటివి చూడొచ్చు. అయితే మహిళల్లో వచ్చే డిప్రెషన్ ని సులువుగా పరీక్షించుకోవచ్చు. కానీ పురుషుల్లో ఇది కాస్త కష్టం.

ఒకవేళ కనుక తీవ్రమైన లక్షణాలు కనుక ఉంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. దీనితో సాధ్యమైనంత వరకు డిప్రెషన్ నుండి బయట పడటానికి వీలవుతుంది. ఒకవేళ కనుక మీరు ఈ కొత్త జీవితానికి అలవాటు పడలేకపోతే ఎక్స్పర్ట్‌ని కన్సల్ట్ చేయండి.డిప్రెషన్ అనేది చాలా సీరియస్‌గా ఉండే మానసిక సమస్య. వీలైనంత వరకు మానసిక నిపుణుడిని కన్సల్ట్ చేసి దీనిని పరిష్కరించుకోవడం మంచిది. ఒకవేళ కనుక అలానే వదిలేస్తే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువై పోతాయి దీనితో ట్రీట్మెంట్ కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు కనుక మీ పరిస్థితి బాగోలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. దీనితో మీరు ఈజీగా బయటపడొచ్చు.