మన పక్కన ఉండే వారు కూడా ఎటువంటి దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా మనతో మాట్లాండేందుకు భయపడుతున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాధులు ఈజీగా వచ్చే సీజన్ కాబట్టి మనం ఈ సీజన్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ప్రజలు వర్షాకాలంలో చాలా రకాల విటమిన్లు, న్యూట్రియంట్స్ గురించి ఆలోచించి మరీ తీసుకుంటారు. కానీ కొన్ని రకాల విటమిన్ల గురించి మాత్రం అంతలా పట్టించుకోరు. కానీ అన్ని రకాల విటమిన్లను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన విటమిన్లు ఏవంటే…
వేసవి కాలం మొత్తం భరించలేని ఉక్కపోతను అనుభవించిన జనాలకు ఒక్క సారిగా వర్షాలు పడడంతో చాలా ఉపశమనం కలిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఉపశమనంతో పాటు ఈ సీజన్ అనేక రకాల వ్యాధులను కూడా తీసుకువస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకు తగ్గట్టుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చాలా మందికి వర్షాకాలం అంటే ఇష్టం. కానీ, ఈ సీజన్ లోనే మనం అనేక రకాల వ్యాధుల బారిన పడతాం.
చాలా మంది ఈ వర్షాకాలం రాగానే ఒక కిటికీ దగ్గర కూర్చుని మంచి మ్యూజిక్ వింటూ, వర్షం పడితే తర్వాత వచ్చే మట్టి వాసనను పీల్చుకుంటూ చల్లదనంతో కూడిన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ, ప్రశాంతంగా రిలీఫ్ అవుతూ ఉంటారు. అంతే కాకుండా ఇంద్రధనస్సు వస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. మనలో చాలా మంది చిన్న వయసులో ఇలాగే ఆలోచించి ఉంటారు. కానీ పెద్దపెరిగిన తర్వాత కూడా నేటికీ కొంత మంది ఇలాగే ఆలోచిస్తారు.
ఈ సమయంలో చిన్న పిల్లలకు తల్లులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతారు. వర్షంలో తడవకూడదని, ఒకవేళ అనుకోకుండా వర్షంలో తడిసినా కూడా వెంటనే తడి జుట్టును ఆరబెట్టుకోవాలని లేకపోతే జలుబు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తారు. అంతే కాకుండా వెచ్చగా ఉండే దుస్తులను ధరించమని చెబుతారు. అలాగే మనం తీసుకునే ఆహార విషయంలో కూడా మార్పులు అవసరమని సూచిస్తారు. ఈ వర్షాకాలం పూట అన్ని రకాల విటమిన్లు, న్యూట్రీయంట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారు. మనం ఈజీగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని చెబుతారు. కానీ చాలా మంది రెయినీ సీజన్ అనేది సంవత్సరం మొత్తంలో వచ్చే బెస్ట్ సీజన్ అని చెబుతారు. ఈ సీజన్లో మనం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.
వర్షాకాలం సీజన్లో ప్రజలు చేసే పెద్ద తప్పు ఏంటంటే పులుపుగా ఉండే పండ్లను వదులుకోవడం. పులుపు అంతగా తినడం ఈ కాలంలో మంచిది కాదని భావించి ప్రజలు పులుపు పదార్థాలు తినేందుకు వెనుకాడతారు. దీని వలన మన శరీరంలో సీ విటమిన్ లోపం ఏర్పడి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి కాలంతో సంబంధం లేకుండా సీ విటమిన్ విరివిగా లభించే పండ్లను తినాలి. సీ విటమిన్ అనేది ఎక్కువగా పులుపుగా ఉన్న పండ్లలోనే లభిస్తుంది. విటమిన్ సీ వలన మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి మనల్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుందనే విషయం అందరికీ తెలుసు. పులుపుగా ఉంటాయని విటమిన్ సీ ఉన్న పదార్థాలను తీసుకోకపోతే మన రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
మీకు మరీ అంతలా పులుపుగా ఉన్న పదార్థాలు తినాలని అనిపించకపోతే.. కొద్ది కొద్దిగా తీసుకోవాలి. కానీ మొత్తమే సీ విటమిన్ ఉండే పదార్థాలు తీసుకోకపోవడం మంచిది కాదు. నిమ్మకాయ రసాన్ని మీరు తినే ఆహారం మీద చల్లుకోవడం చేయడం చాలా మంచిది. లేదంటే నిమ్మకాయతో వివిధ రకాలైన రసాలను చేసుకుని తాగడం మంచిది. మీకు నిమ్మకాయ తినాలని అనిపించకపోతే సీ విటమిన్ లభించే బొప్పాయి పండు, జామ, క్యాప్సికమ్ (బెల్ పెప్పర్) వంటి పదార్థాలను తీసుకోవాలి. అంతే కానీ మొత్తంగా సీ విటమిన్ ను తీసుకోకపోవడం వలన మనలో రోగ నిరోధక శక్తి తగ్గి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ ప్రీ బయాటిక్ ప్రో బయాటిక్ ఆహార పదార్థాలంటే ఏంటని చాలా మంది తికమక పడతారు. కానీ ఈ పదార్థాలను గురించి తెలుసుకోవడం చాలా సింపుల్. ఒక పదార్థాన్ని నిల్వ ఉంచి అందులో బ్యాక్టీరియాను కలిపి కొత్త పదార్థాన్ని తయారు చేయడాన్ని ప్రో బయాటిక్ అని అంటారు. ఉదాహరణకు.. పాలను నిల్వ ఉంచి అందులో ఒక రకమైన బ్యాక్టీరియాను కలపడం వలన పెరుగు తయారవుతుంది. కొంత మంది ప్రీ బయాటిక్ ప్రో బయాటిక్ ఆహార పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడరు.
ఎక్కువ శాతం మంది ప్రో బయాటిక్ ఆహారమైన పెరుగును తీసుకునేందుకు విముఖత చూపుతారు. ఇలా ప్రీ బయాటిక్ ప్రో బయాటిక్ పదార్థాలను తీసుకోవడం తగ్గించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ఆహారాలను తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పెరుగు, మజ్జిగ, ఊరగాయ, వంటి పదార్థాలు ప్రో బయాటిక్ పదార్థాల కిందకు వస్తాయి. వీటిని తీసుకోవడం వలన వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంటారని అనేక మంది నిపుణులు తెలిపారు. ఈ పదార్థాలు వివిధ రకాలుగా మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాలతో పోరాటం చేస్తాయి.
ఈ వర్షాకాలం సీజన్ లో మన గొంతును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం మొదట చేసే పని చల్లని నీటిని తీసుకోవడం మానేస్తాం. చల్లని నీరు మన గొంతుకు హాని చేసి జలుబు వచ్చేలా చేస్తుంది. అందుకే మనం ఈ కాలంలో చల్లని నీటిని తాగడం మానేస్తాం. చల్లని నీటిని తీసుకోవడం వలన అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి. మీకు అంతలా ఫ్రిడ్జ్ వాటర్ తాగడం ఇష్టం లేకపోతే సంప్రదాయబద్ధంగా ఏళ్ల నుంచి వాడుతున్న కుండ నీటికి మారడం ఉత్తమం.
ఇది మీ దాహాన్ని తీర్చడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కుండలో నీటిని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరగవుతుందని అనేక మంది ఆరోగ్య నిపుణులు సూచించారు. అంతే కాకుండా మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మన శరీరంలో ఉన్న హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. మనల్ని ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది. కావున ఈ రెయినీ సీజన్లో కుండ నీరు తీసుకోవడం చాలా మంచిది.
కొన్ని రకాల ఆహారాలు మనకు స్థానికంగా లభిస్తాయి. వాటి వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి అనేక రకాల పోషకాలు గల ఆహార పదార్థాలు సంవత్సరం కేవలం కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. కానీ ఈ సీజన్ లో అటువంటి ఆహార పదార్థాలను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి ప్రజలు వాటిని తీసుకోకుండా దూరంగా ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఇవి కాలానుగుణంగా లభించే పండ్లు కాబట్టి వాటిలో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు బయట మనకు లభించే అనేక రకాల నూనెతో చేసిన పదార్థాలను తినాలని అనిపిస్తుంది. కానీ ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం కలుగుతుంది. ఇవి ఎక్కువ సేపు నూనెలో వేయించడం వలన ఇవి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. బయట చినుకులు పడుతూ ఉంటే వేడి, వేడిగా తయారు చేసిన పకోడీని తింటూ చాయ్ తాగాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ ఇవి ఎక్కువగా తినడం వలన మన కడుపులో ఏదో అజీర్తి ఫీలింగ్ కలుగుతుంది.
కాబట్టి ఇలా బయట దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఈ సీజన్లో మంచి నీళ్లను తాగడం చాలా వరకు తగ్గిస్తారు. బయట వాతావరణం చల్లగా ఉండడం వలన మనకు వేసవిలో అనిపించినట్లు తరుచూ దాహంగా అనిపించదు. కానీ ఈ సీజన్ లో రోజుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం వలన మన శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.