ఏపీ శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో భాగంగా కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య రగడ చోటు చేసుకుంది. ఉద్యోగాల కల్పన అంశంపై మండలిలో వైసీపీ.. టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగం అంశంలో తెలుగు.. ఇంగ్లీష్‌లో ప్రచురణల మధ్య తేడా ఉంది అంటూ గందరగోళం నెలకొంది. ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అని చెప్పడం కూటమి ప్రభుత్వానికి ఎంత వరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రశ్నించారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని స్పష్టంగా గవర్నర్ ప్రసంగంలో ఉందని వైసీపీ ఎమ్మెల్సీ అన్నారు.