హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
అయితే, హైదరాబాద్కు ఉత్తరం, పడమర వైపు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చేవెళ్ల ప్రాంతంలో కమ్ముకున్న మేఘాలు జంట నగరాల వైపు దూసుకొస్తున్నాయని.. అందుకే భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. కాగా, కొద్దిరోజులుగా తీవ్ర ఎండతో సతమతమవుతున్న భాగ్యనగరవాసులకు వర్షం కొంత ఉపశమనం కలిగించనుంది.