అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం

అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం

వాయువ్య భారత దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరగోమనం చెందాయి. వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ నుంచి నైరుతి నిష్క్రమణం మొదలవ్వనుంది.

మరోవైపు తూర్పు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కర్ణాటక, సీమ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.

ఈ నెల 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తా, సీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.