ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో భారీ వర్షాలు

ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అత్యధికంగా బండి ఆత్మకూరు మండలం లో 180.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహానంది – గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుండి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల – భీమవరం మధ్య వక్కిలేరు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.