బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాండిచేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీ. చైన్నైకి ఆగ్నేయ దిశగా 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇది బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారి, వాయువ్య దిశగా ప్రయాణించి, కారైకాల్, మహా బలిపురం, ప్రాంతాల మధ్య తీరాన్ని 25 నవంబర్న సాయంత్రం తీవ్ర తుఫానుగా గంటకు 100-110 కి.మీ. గాలి వేగంతో దాటవచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది