కోస్తాలో భారీ వర్షాలు

కోస్తాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. జార్ఖండ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా దక్షిణ కోస్తా వరకూ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.