కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది.