దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం నీట మునిగింది. గడిచిన కొద్ది గంటలుగా మహారాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ముంబై సహా ఆరు జిల్లాల్లో భారీ వర్షపాతం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముంబై సిటీలోని లోటత్తు ప్రాంతాలు వరదలో మునిగాయి.
ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇది చాలదన్నట్లు రాబోయే కొద్ది గంటల్లో మరిత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది ముంబై సిటీతో పాటు మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.