తెలంగాణలో పలుచోట్ల వర్షాలు

తెలంగాణలో పలుచోట్ల వర్షాలు

ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండుమూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు బలంగా వీస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. భారీ వర్షాలతో వరదలు కూడా రావచ్చని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపింది.