తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పలుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

కాగా, ఆదివారం తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 2.1 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీంతో రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం మాదిరిగా, మంగళవారం అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ 90 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వెల్దండ(నాగర్‌కర్నూల్‌ జిల్లా)లో 4.8, వెలిజాల(రంగారెడ్డి)లో 3.8, చలకుర్తి(నల్గొండ)లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.