భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహ నగరం పరిస్థితి ఆందోళన కరంగా మారింది. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారు జామునుండి పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కోటి, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అంతేకాక పలు చోట్ల మోస్తరు గా వర్షం కురుస్తోంది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మీర్ పేట్ లో ఇంకా వర్షాలు పడుతుండడంతో తో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.
అయితే పలు చోట్ల పరిస్తితి కుదుట పడగా, కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకొని పోయాయి. మరికొన్ని చోట్ల బురదమయం గా తయారు అయ్యాయి. అయితే నేడు, రేపు కోస్తా ఆంధ్ర లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి అని వెల్లడించింది. అయితే తీర ప్రాంతంలో ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దు అని హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని తెలిపింది.