పలురాష్ట్రాల్లో రానున్న భారీవర్షాలు

పలు రాష్ట్రాల్లో రానున్న భారీవర్షాలు

ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌తో పాటు యానాం, పుదుచ్చేరి, కరైకల్‌ తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోని ఐఎండి బులిటెన్‌ను విడుదల చేస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటుగా పిడుగులు కోస్తా ఆంధ్ర యానాం, రాయల సీమ , పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాలల్లో పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.

తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, లక్షద్వీప్, మాల్దీవ్స్ తీర ప్రాంతాల్లో గాలులు వీస్తాయని ఇంకా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడతాయని  ప్రజలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు ముందు జాగ్రత్తగా తెలియచేశారు.