సరికొత్త లుక్‌లో కనిపించనున్న ప్రభాస్‌

సరికొత్త లుక్‌లో కనిపించనున్న ప్రభాస్‌

‘బాహుబలి’తో ప్రభాస్‌ హీరో రేంజ్‌ అమాంతం పెరిగింది. లోకల్‌ స్టార్‌ కాస్త నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. అందుకే పాన్‌ – ఇండియా అప్పీల్‌ ఉండేలా కథలను ఎంచుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్‌ హీరో. తాజాగా ‘సాహో’తో పలకరించిన ప్రభాస్‌ ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘జాన్‌’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే షూటింట్‌ను స్టార్ట్‌ చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడికల్‌ లవ్‌ స్టోరీలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

1970ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని సమాచారం. పీరియాడికల్‌ లవ్‌స్టోరి కాబట్టి కొత్త షెడ్యూల్‌ను ఆ స్టైల్లో తెరకెక్కించడానికి యూనిట్‌ సన్నద్ధమవుతుంది. అందుకోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఓ స్పెషల్‌ సెట్‌ను వేస్తున్నాడు.భారీ ఖర్చుతో ఈ సెట్‌ను నిర్మిస్తున్నారట. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ‘జాన్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా పక్కా ప్లానింగ్‌ జరుగుతుంది.