మళ్ళీ ఫాం లోకి రామ్…’హ‌లోగురు ప్రేమ కోస‌మే’ ట్రైల‌ర్‌…!

Hello Guru Prema Kosame Trailer

 

కొన్నాళ్లుగా స‌రైన హిట్స్ లేక మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని ప్ర‌స్తుతం ‘హ‌లో గురు ప్రేమకోస‌మే’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. నేను లోకల్ ఫేం త్రినాధ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా.. రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్, సురేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాట‌లు నిన్న మార్కెట్లోకి డైరెక్ట్‌గా విడుద‌ల‌య్యాయి.

hello-guru
అక్టోబ‌ర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని రేపుతున్నాయి. త‌న ల‌వ్ స‌క్సెస్ అయ్యేందుకు రామ్ ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేస్తున్నాడ‌నేది ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. రామ్ కెరీర్‌లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌ని టీం భావిస్తుంది. ప్ర‌స్తుతం మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతుండ‌గా, ఈ సీజన్ లో విడుద‌ల కానున్న సినిమాల‌ని త‌ట్టుకొని ఈ మూవీ ఎంత విజ‌యం సాధిస్తుంద‌నేది చూడాలి.