ఇప్పుడంటే కారవాన్స్ వచ్చి అన్ని వసతులు ఉన్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ లొకేషన్స్‌లో బట్టలు మార్చుకోవాలంటే సరైన ప్లేస్ ఉండేది కాదు. కనీసం టాయిలెట్స్ వసతి కూడా ఉండేది కాదు. భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ నన్ను అవమానించాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ సహా యూనిట్ అందరం కలిసి భోజనం చేస్తుండగా నేను అక్కడే వాళ్లతో పాటే తింటున్నాను.
ఇంతలో ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అని అవమానించాడు. ఆ మాటతో చాలా కోపం వచ్చింది. టేబుల్ ఎత్తి అతనిపై పడేద్దామనుకున్నా. కానీ తింటే వీళ్లందరితోనే కలిసి తినాలని డిసెడ్ అయి మరింత కష్టపడ్డాను. ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడు. మళ్లీ అతనే ఓ సినిమా షూటింగ్ సమయానికి వచ్చి చాలా మర్యాదగా నాకు భోజనం పెట్టాడు. కానీ కెరీర్‌లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఇప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది.