ఆమెకి మరింత’ పెరిగిన క్రేజ్ : “అనిమల్”.

ఆమెకి మరింత' పెరిగిన క్రేజ్ : “అనిమల్”.
Cinema News

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దగ్గర వినిపిస్తున్న మరో సినిమా పేరు “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా లో రష్మికతో పాటుగా మరో యంగ్ నటి కూడా ఆడియెన్స్ దృష్టిని బాగా ఆకర్షించింది.

ఆమెకి మరింత' పెరిగిన క్రేజ్ : “అనిమల్”.
Tripti Dimri , Ranbeer Kapoor

మరి ఆమెనే నటి త్రిప్తి దిమ్రి. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం ఈమెకి భారీగా క్రేజ్ పెరిగినట్టు తెలుస్తోంది . సోషల్ మీడియాలో కూడా ఆమె కోసం చాలా మాట్లాడుతూ ఉండగా ఆమెకి తన సోషల్ మీడియాలో కూడా సాలిడ్ లెవెల్లో క్రేజ్ బాగా పెరిగింది. సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా 6 లక్షల మేర ఆమెకి ఫాలోవర్స్ ఉంటే ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఆమె కౌంట్ 1.5 మిలియన్ కి చేరుకుంది. దీనితో ఇపుడు ఆమె మంచి హాట్ టాపిక్ గా మారింది అని తెలుస్తుంది .