కోవిడ్ వచ్చిందని బెంబేలెత్తిపోవద్దు. ఎర్లీ డిటెక్షన్, ఇమ్మీడియట్ మెడికేషన్‌తో పాటు సానుకూల దృక్పథం (పాజిటివ్ ఆటిట్యూడ్)తో మహమ్మారిని ఎదుర్కొందాం అంటున్నారు సినీనటుడు కమల్ కామరాజ్. ‘షూటింగ్ కోసం డెహ్రాడూన్, చెన్నై వెళ్లొచ్చా. కోవిడ్ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా భోపాల్‌లో పరిస్థితి బాగోకపోవడంతో మా అత్తా మామల్ని హైదరాబాద్ తీసుకువచ్చాం.
మా మామగారికి 75 ఏళ్లు, అత్తయ్యకు 70 వరకూ ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నాయి. ఎందుకైనా మంచిదని లక్షణాలు లేకపోయినా వారు రాకముందే మరోసారి టెస్ట్‌కు శాంపిల్ ఇచ్చా. మా అత్తామామలు ఇంటికి వచ్చిన రోజే నా రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. ఆ మరుసటి రోజే ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేకపోయినా నా తల్లిదండ్రులు, నా భార్య, అత్తా, మామ, పని వాళ్లిద్దరికీ కూడా టెస్ట్ చేయించాను. మా పేరెంట్స్‌కి తప్ప అందరికీ పాజిటివ్.