తమిళ్ రాకర్ జిందాబాద్ అంట !

Hero Heroine Trailer

‘హీరో హీరోయిన్’ టీజర్‌తో సందడి చేస్తున్నాడు నవీన్ చంద్ర. గాయత్రి సురేశ్‌, పూజా జవేరీ, నవీన్ చంద్ర హీరో హీరోయిన్స్‌గా కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్‌ను బుధవారం నాడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పైరసీ అండ్ సినిమా నేపథ్యంలో రూపొందించినట్టు టీజర్‌ ను బట్టి అర్ధమవుతోంది. ఇక మా ఎన్టీఆర్ సినిమాని పైరసీ చేస్తావ్ రా అని హీరో షర్ట్ పట్టుకుని ఫ్యాన్స్ అడుగుతుంటే.. నెక్స్ట్ వీక్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంది దానికి ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా అని చెప్పే డైలాగ్‌ని బట్టి ఈ చిత్రంలో హీరోగారి పనేంటో ఇట్టే చెప్పేయొచ్చు. ప్రతి మగాడు ప్లేబాయ్, ఛాన్స్ దొరికితే కుక్కలమే, ప్రొడ్యుసర్ కూతురివైతే ఏంటే. నిన్నూ వదల్ను.. పైరసీని వదల్ను., లాంటి డైలాగ్స్ సినిమా మీద ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. ఇక చివర్లో విడుదల రోజునే సినిమాని పైరసీ చేసి నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్న ‘తమిళ్ రాకర్’ వెబ్‌ సైట్‌కి హీరో జై కొట్టడం కాస్త వివాదం అయ్యేట్టే ఉంది మరి ఏమవుతుందో .