మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న కార్తీ

మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న కార్తీ

‘సిరుల్తై’ (‘విక్రమార్కుడు’ చిత్రం తమిళ రీమేక్‌) చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు హీరో కార్తీ. మరోసారి స్క్రీన్‌ మీద డబుల్‌ యాక్షన్‌ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇరుంబుదురై (తెలుగులో అభిమన్యుడు), హీరో (తెలుగులో శక్తి) చిత్రాలకు దర్శకత్వం వహించిన పీయస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు కార్తీ.

ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారనేది తాజా వార్త. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా ‘సుల్తాన్, మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలు చేస్తున్నారు కార్తీ.