నానికి యాక్సిడెంట్…టెన్షన్ లో ఫ్యాన్స్ ?

Hero Nani has a road accident

జెర్సీ బంపర్ హిట్ కావడంతో మ‌ళ్లీ జోరు పెంచేసాడు నాని. వ‌ర‌స సినిమాల‌తో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. విక్ర‌మ్ కే కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్తైపోయింది. అయితే ఈ మ‌ధ్యే షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో నానికి చిన్న యాక్సిడెంట్ అయింది. దాంతో ఆయ‌న కాలికి గాయ‌మైంది. వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు చిత్ర యూనిట్. ప‌రిశీలించిన డాక్ట‌ర్లు ప్ర‌మాదం ఏం లేద‌ని చెప్ప‌డంతో ఊపిరి పీల్చుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే రెస్ట్ కావాలని చెప్పడంతో నాని ఒక పదిరోజులు రెస్ట్ తీసుకోనున్నాడు, దీంతో ఈ సినిమా షూట్ కూడా పడి రోజులు ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో ఐదుగురు ఆడ‌ దొంగలకి నాని హెడ్ దొంగ‌గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. జెర్సీ త‌ర్వాత మ‌రోసారి అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మ‌రో మూడు సినిమాల‌కు కూడా క‌మిట్మెంట్ ఇచ్చాడు నాని. మొత్తానికి అనుకోని సెలవులు దొర‌క‌డంతో ఇంట్లో కొడుకు అర్జున్‌తో ఆడుకుంటున్నాడట నాని. అభిమానులు మాత్రం ఆయ‌న‌కు ఏమయిందో క్లారిటీ లేక టెన్షన్ పడుతున్నారు.