ఇఫ్తార్ విందుల్లో జగన్, బాబు….విమర్శించిన జగన్

jagan and babu at iftar feast

పవిత్ర రంజాన్ మాస నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి జగన్ ముఖ్యమంత్రి హోదాలో విచ్చేసి, ముస్లిం మతగురువులతో కలిసి ప్రార్థనలు చేశారు. మరోవైపు, మాజీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు తన కుమారుడు నారా లోకేశ్ సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు కూడా వచ్చారు. చంద్రబాబు తదితరులు ముస్లిం మతపెద్దలతో కలిసి ఇఫ్తార్ దువా నిర్వహించారు.  ఇక ఈ నేపధ్యంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ జగన్. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను దుర్మార్గంగా కొనడమే కాకుండా, సిగ్గు, శరం లేకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని మండిపడ్డారు. అయితే, ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంతో గొప్పదని, సరిగ్గా 23వ తారీఖునే ఫలితాలు రావడం, టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 కావడం విచిత్రమని అన్నారు. అంతేకాకుండా, వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలను లాగేసుకున్నారని, ఆశ్చర్యకరంగా టీడీపీకి లభించిన ఎంపీలు కూడా ముగ్గురేనని తెలిపారు.