నానికి చూడాలని ఉందట!

Nani wants to watch Sanju movie and Ee Nagaraniki Emaindi

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నాని తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు నాగార్జునతో కలిసి మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న నాని మరో వైపు వారంలో రెండు రోజులు బిగ్‌బాస్‌ షోకు కేటాయిస్తున్నాడు. ఇలా చాలా బిజీగా ఉన్న నాని తాజాగా విడుదలైన రెండు చిత్రాలను చూడాలని చాలా ఆశపడుతున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. ఆ రెండు చిత్రాల్లో మొదటిది ఈ నగరానికి ఏమైంది కాగా, రెండవ చిత్రం బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ ఆటో బయోగ్రఫీ సంజు.

ఈ రెండు చిత్రాలపై సాదారణ ప్రేక్షకుల నుండి సెలబ్రెటీల వరకు భారీ అంచనాలున్నాయని నాని వ్యాఖ్యలతో తేలిపోయింది. నాని చూడాలని ఎంతో ఆశపడ్డ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వస్తుండగా, బాలీవుడ్‌ సంజు చిత్రానికి మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వీకెండ్‌లో నాని ఈ రెండు చిత్రాలను చూస్తాడేమో చూడాలి. నానితో పాటు ఎంతో మంది బాలీవుడ్‌ చిత్రం సంజును చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. సంజయ్‌ దత్‌ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆయన పడ్డ కష్టాలు ఎలా బ్యాడ్‌ బాయ్‌ నుండి స్టార్‌ హీరో అయ్యాడు అనే విషయాన్ని సంజు చిత్రంలో చూపించారు. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ హిరానీ తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలతో పాటు ఈ వారం పలు చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు వచ్చాయి. అయితే ఎక్కువ శాతం చిత్రాలు ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.